ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసించిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున నాగచైతన్య అఖిల్ ల కలక్షన్స్ పవర్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు వెండితెర మన్మధుడు గా ఎన్నో హిట్స్ ఇచ్చిన నాగార్జున సినిమాలు ఏవి పెద్దగా జనంలో ఆశక్తిని క్రియేట్ చేయలేకపోతున్నాయి.


వాస్తవానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాగార్జున 38 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు 100 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’ తరువాత నాగార్జునకు చెప్పుకోతగ్గ హిట్ లేదు. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ మూవీ కలక్షన్స్ కూడ అంతంత మాత్రంగానే వచ్చాయి.


ఇక నాగచైతన్య విషయానికి వస్తే ‘మజిలీ’ లవ్ స్టోరీ సక్సస్ అయినప్పటికీ ఆ సక్సస్ క్రెడిట్ అంతా సమంత సాయి పల్లవి ల ఖాతలలోకి చేరిపోయింది. ‘లవ్ స్టోరీ’ సినిమాకు మొదటిరోజు 7 కోట్లకు పైగా కలక్షన్స్ వస్తే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘థాంక్యూ’ మూవీ మొదటిరోజు కేవలం కోటిన్నర కలక్షన్స్ మాత్రమే వచ్చాయి అని వస్తున్న వార్తలు విని చాలామంది షాక్ అవుతున్నారు. అఖిల్ పరిస్థితికి వస్తే ఎట్టకేలకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ ద్వారా హిట్ కొడితే లేటెస్ట్ గా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ బాగా వచ్చినప్పటికీ ప్రస్తుత తరం ప్రేక్షుకులు ఇలాంటి స్పై కథలను ఆదరిస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి.


అఖిల్ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన వైష్ణవ్ తేజ్ డీకే టిల్లు ఫేమ్ జొన్నలగడ్డ నటించిన సినిమాలు 100 కోట్ల గ్రాస్ ను దాటితే అఖిల్ ఇప్పటివరకు నటించిన ఎసినిమాకు 40 కోట్ల మార్క్ ను కూడ దాటక పోవడం అక్కినేని కాంపౌండ్ ను కలవర పెడుతున్నట్లు టాక్. ఇప్పుడు దసరా రేస్ కు రాబోతున్న నాగార్జున ‘ఘోస్ట్’ మూవీ అయినా 100 కోట్ల గ్రాస్ వైపు అడుగులు పడకపోతే ఇక నాగార్జున కేవలం బుల్లితెర కు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ అక్కినేని కాంపౌండ్ ను కలవర పెట్టే ఆస్కారం ఉంది..




మరింత సమాచారం తెలుసుకోండి: