టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ దర్శకత్వంలో లైగర్ సినిమాలు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటి అనన్య పాండేతో కలిసి తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో  పాల్గొన్నారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ విజయ్ దేవరకొండ విచిత్రమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.అయితే ఈ విధంగా విజయ్ దేవరకొండ కరణ్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ ను ప్రశ్నిస్తూ నీకు సారా అలీ ఖాన్, 

జాన్వీ కపూర్ అంటే ఇష్టమా అని ప్రశ్నించారు. ఇకపోతే ఈ ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఇక ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ విషయం ఎక్కడి వరకు వెళ్తుందోనని తనకు భయంగా ఉందని, నిజంగా వాళ్ళిద్దరూ ఎంతో దయ కలిగిన వారు అంటూ కామెంట్ చేశారు. ఇదిలావుంటే ఇక భారత దేశంలో నువ్వు అత్యంత ఇష్టపడే మహిళ పేరు చెప్పమని విజయ్ ను కరణ్ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ... తనకు ఇష్టమైన మహిళ, హీరోయిన్ సమంత అంటూ సమాధానం చెప్పారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సమంత గురించి మాట్లాడుతూ సమంతను డార్లింగ్ గా, ఒక అద్భుతమైన శక్తి కలిగిన మహిళగా అభివర్ణిస్తూ తనకు సమంత అంటే ఇష్టమనీ తెలిపారు. పోతే విజయ్ దేవరకొండ సమంత కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో తిరిగి వీరిద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ క్రమంలోనే సమంత గురించి విజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: