ఇక ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడిగా పరిచయం అయి మొదటి సినిమాతోనే ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అప్పటినుంచి బాగా ఫేమస్ అయ్యాడు ఈ బుచ్చిబాబు. ప్రతి ఈవెంట్ లో కూడా కనిపిస్తున్నాడు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కథ చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. అయితే అది మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ కొరటాల శివ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు అనౌన్స్ చేశారు. ఒకవేళ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే ఆ రెండిటి తర్వాతే చేయాలి. మరి అప్పటి వరకు బుచ్చిబాబు ఏం చేస్తాడు అంటే అది మాత్రం ఎవ్వరిదగ్గర సమాధానం లేదు.ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఏవి కూడా చేస్తున్నట్టు ప్రకటించలేదు బుచ్చిబాబు. తాజాగా డైరెక్టర్ సుకుమార్ తో స్టోరీ డిస్కషన్ లో బుచ్చిబాబు కనిపించారు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా బుచ్చిబాబు పుష్ప 2 కోసం సుకుమార్ కి హెల్ప్ చేస్తున్నాడేమో, ఖాళీగా ఉండకుండా పుష్ప 2 సినిమాకి వర్క్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు.


ఇక తాజాగా బుచ్చిబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. సుకుమార్ తో స్టోరీ డిస్కషన్ లో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. 'ఇక ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నా సినిమా కథ డిస్కషన్ సందర్భంలోది. మా గురువు గారు సుకుమార్ సర్ నా కోసం, ఇంకా నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. మా సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఇంకా ఆయనకి ఇచ్చేంత లేదు' అని పోస్ట్ చేశాడు.దీంతో ఇక బుచ్చిబాబు ఏదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? లేక ఎన్టీఆర్ కథకే సుకుమార్ మెరుగులు దిద్దుతున్నారా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు నెటిజన్లు. మరి డైరెక్టర్ బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: