టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్. కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు ఈ సినిమాని మొత్తం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంకా అలాగే సాంగ్స్ అయితే సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా ఇంకా ఫుల్‌ మాస్‌ లుక్‌లో, నత్తిగా మాట్లాడే పాత్రలో అలాగే కిక్ బాక్సింగ్ చేసే యువకుడిగా కనపడనున్నాడు. విజయ్ కి తల్లిగా సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇంకా అలాగే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాకి ఓ రేంజ్ లో భారీ హైప్ అనేది వచ్చింది.ఇక విజయ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న ఈ లైగర్ సినిమాని ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు.ఇంకా అలాగే దీంతో ఇటీవలే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. 


తాజాగా లైగర్ సినిమా నుంచి మరో సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. 'వాట్‌ లగా దేంగే.. ' అంటూ సాగే మాస్ సాంగ్ ని మూవీ టీం వారు రిలీజ్ చేసారు.ఈ పాటలో విజయ్.. వి ఆర్‌ ఇండియన్స్‌. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం అంటూ మొదలుపెట్టి బాగా మోటివేట్ చేసేలాగా మాస్ సాంగ్ గా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ఇందులో వున్న విజువల్స్ కూడా చాలా మాస్ గా ఉన్నాయి.కిక్ బాక్సింగ్ పోరాట సన్నివేశాలు ఇంకా అలాగే ముంబై స్లమ్ లో డ్యాన్స్ చేయడం చూపించారు.ఇక లైగర్ సినిమాకి టోటల్ గా 80 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. కాబట్టి భారీ టార్గెట్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద పూరీ జగన్నాథ్ ఇంకా విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: