టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విషయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలాకాలమే అవుతోంది. కాకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా జరుగుతూ ఉండటం వల్ల ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే చాలా కాలం క్రితమే ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఆగస్ట్ 12 వ తేదీ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో దాదాపుగా ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని దసరాకు విడుదల చేయాలి అని మూవీ యూనిట్ భావించినట్లు అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమాను దసరాకు కూడా విడుదల చేసే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఏజెంట్ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ ,  మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ మూవీ,  తలపతి విజయ్ వారసుడు మూవీ లను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. మరి ఈ హీరోలతో అఖిల్ పోటీ పడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: