దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ని తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ,  ఆలియా భట్ , ఒలీవియా మోరిస్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో రామ్ చరణ్ ... అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ,  జూనియర్ ఎన్టీఆర్ ...  కొమురంభీం పాత్రలో నటించాడు.

మూవీ లో అజయ్ దేవ్ గన్ ,  శ్రేయ , సముద్ర కని ఇతర కీలక పాత్రల్లో నటించగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాను భారి బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాడు. 25 మార్చ్ 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 1,100 కోట్ల కు పైగా కలెక్షన్ లను సాధించింది. 

సినిమా హిందీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. హిందీ నుండి కూడా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో  బుల్లితెరపై కూడా హిందీ ప్రేక్షకులను అకట్టుకోబోతుతుంది.  ఆర్ ఆర్ ఆర్ మూవీ 14 ఆగస్ట్ 2022 వ తేదీన జీ సినిమా చానల్లో ప్రసారం కాబోతుంది. మరి ఈ సినిమా బుల్లి తెరపై ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr