రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎవరికి ఎంతగా ఉపయోగపడిందో తెలియదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మాత్రం చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇటీవల ఈ సినిమా ఓటీటీ లలో కూడా సత్తా చాటడం తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అలా ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ విడుదల అయ్యి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈ సినిమా విడుదలయి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తావన  జరుగుతుంది అంటే దానికి కారణం రామ్ చరణ్ అని చెప్పాలి.

ఆయన ఈ సినిమాలో నటించిన తీరుకు అంతర్జాతీయంగా మంచి కితాబు లభిస్తుంది.  ఎంతో మంది ఆయనను కొనియాడుతున్న నేపథ్యంలో వారిలో హాలీవుడ్ మేకర్స్ కూడా ఉన్నారు. తాజాగా మార్వెల్ సంస్థ నుంచి ఓ కీలక వ్యక్తి ఈ సినిమాకు సంబంధించిన పాత్ర పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ విధంగా జేమ్స్ బాండ్ తరహా లో సినిమా చేస్తే బాగుంటుంది అని కొందరు అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు చేస్తున్న శంకర్ సినిమా తర్వాత ఆయన ఆ తరహా సినిమా చేసి అంతర్జాతీయంగా దాన్ని విడుదల చేస్తే తప్పకుండా మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు.

ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ గొప్ప పేరును సంపాదించుకున్న మన హీరోలు ఇప్పుడు ఫ్యాన్ వరల్డ్ సినిమాలను టార్గెట్ చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. మరి చరణ్ అభిమానుల కోరిక మేరకు ఆ విధమైన సినిమా చేస్తాడా అనేది చూడాలి. ఇకపోతే శంకర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా వారసుడుగా సినిమా పరిశ్రమ లోకి వచ్చి ఈ హీరో ఇంతటి స్టార్ హీరోగా ఆయన మారడం నిజంగా ఎంతో గొప్ప విశేషం అనే చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: