పవన్ కళ్యాణ్ హీరోగా ఓ తమిళ చిత్రం యొక్క తెలుగు రీమేక్ ఇప్పుడు రూపొందుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారని అంటున్నారు. ఒక మంచి కథ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న రెండు భారీ చిత్రాలను పక్కనపెట్టి ఈ సినిమా చేయడం వెనుక వారు కొంత నిరాశ పడుతున్నారు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తక్కువ సమయంలో పూర్తిచేసి ఆ చిత్రాలను మొదలుపెట్టాలని పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరు దర్శకులకు మాత్రం పవన్ కళ్యాణ్ నిద్రలేని రాతలను మిగులుస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా కోసం పలు టైటిల్స్ పరిశీలించిన చిత్ర బంధం చివరగా జగత్ జజ్జరికా అనే టైటిల్ను పెట్టబోతున్నారని వార్తలను వినిపిస్తున్నాయి. 

ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సార సినిమాలో ఈ డైలాగ్ మనకు వినిపిస్తుంది. ఇంకా విడుదల కానీ ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ విధంగా ఈ రకమైన కాచిపదాన్ని టైటిల్ గా పెడితే తమ సినిమాకు బాగా ఉపయోగపడుతుందని భావించి సముద్ర ఖని ఈ టైటిల్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా త్వరలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు చెప్పి ఒప్పించబోతున్నారట. మరి వినడానికి ఎంతో వెరైటీగా క్యాచీ గా అనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కోసం ఈ టైటిల్ తీసుకు వస్తారా అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త నటించబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: