టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చెయ్యకపోయినా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో లక్షలాది అభిమానులని ఆయన సొంతం చేసుకున్నారు. ఓవర్సీస్లో మహేష్ క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే..ఆయనకు బిగ్గెస్ట్ బ్రేక్ అందించి లీడింగ్ స్టార్ హీరోగా నిలబెట్టింది ఇంకా అప్పటివరకున్న సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది పోకిరి.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్  డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా వచ్చి దశాబ్దమున్నర కాలం దాటిపోతుంది. ఇంతకాలమైనా కూడా ఈ సినిమాను ఎప్పుడు చూసినా ప్రతీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంటుంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు పోకిరి (4K UHD) వెర్షన్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించి ఆసక్తికర వార్త కూడా బయటకు వచ్చింది. తాజా అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 9 వ తేదీన కాలిఫోర్నియాలో పోకిరి స్పెషల్ షో ప్లాన్ చేశారు.


 ఆశ్చర్యకర విషయమేంటంటే బుకింగ్స్ మొదలైన గంటలోపే టికెట్స్ అన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఇంకా టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మరో షోని కూడా వేస్తారట. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో ఈ ఒక్క విషయంతో పూర్తిగా తెలిసిపోతుంది.సూపర్ స్టార్ అభిమానులు మరో షో కూడా వేయాలని సన్నాహాలు చేస్తుండగా..త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా షురూ కానున్నాయట. పోకిరి మహేశ్‌ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. పోకిరిలో ఒక్కో పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు.ఓవర్సీస్లో మహేష్ క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: