నందమూరి ఫ్యామిలీ పెద్ద వారసుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'బింబిసారా'. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ ఫాంటెసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ఇంకా అలాగే ట్రైలర్లు ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది.ఇక 'బింబిసారా' చిత్రాన్ని సరికొత్త కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా కథ కూడా చాలా వైవిధ్యంగా ఉందని, ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఎంతగానో ఆకట్టుకుంటాయని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కూడా చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.


అటు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రావటం ఇప్పటికే ఆయన ఈ సినిమాను చూసి బ్లాక్‌బస్టర్ అని 'బింబిసారా' టీమ్‌కు చెప్పడంతో,ఈ చిత్ర యూనిట్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. పవర్‌ఫుల్ పాత్రలో హీరో కళ్యాణ్ రామ్ నటన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమాకి మరో సమస్య వచ్చింది.ఈ సినిమా రిలీజ్ రోజే హాలీవుడ్ నుంచి "బుల్లెట్ ట్రైన్" ఇంకా "సూపర్ లీగ్ ఆఫ్ పెట్స్" అనే సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ఇక వాటి వల్ల ఈ మూవీ వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. కాగా ఇక ఈ సినిమాలో అందాల భామలు కేథరిన్ తెరిస్సా ఇంకా సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.అయితే హాలీవుడ్ సినిమాలను తట్టుకొని ఈ సినిమా నిలబడటం అనేది కంగారు కలిగించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: