చెన్నై లో భారీ వస్త్ర వ్యాపారి అయిన అరుల్ శరవణన్ కి హీరో అవ్వాలన్న ఆలోచన అయితే వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం ఓ భారీ సినిమా తీశారు. ది లెజెండ్ అంటూ పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా చేశారు.


శుక్రవారమే ఆ సినిమా రిలీజైంది. జేడీ అండ్ జెర్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతెలా కూడా నటించింది. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు అక్కడ అర కొర అవకాశాలతోనే కెరియర్ వెళ్లదీస్తుంది. అయితే ఆమెని తెచ్చి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఈ సినిమాలో చేయించారు.


మాములుగా అయితే ఊర్వశి రౌతెలా ఒక సినిమాకి 2 నుంచి 3 కోట్ల దాకా తీసుకుంటుందని టాక్. బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని ఆమెతో తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా కూడా చేశారు సంపత్ నంది. ఆ సినిమాకైతే ఊర్వశికి కోటి లోపే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సినిమాకి 2 లేదా 3 కోట్లు తీసుకునే ఆమెని తెచ్చి ది లెజెండ్ కోసం 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.. హీరోగా తొలి సినిమా ఆమె సెంటరాఫ్ ఎట్రాక్షన్ కావాలని ఊర్వశికి అంత ఇచ్చినట్టు తెలుస్తుంది.


  ఆ 20 కోట్ల మందం ఊర్వశి సినిమాకు న్యాయం చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో 10 సినిమాలు చేసినా కానీ రాని మొత్తం అమ్మడు ఒక్క సినిమాతో సంపాదించేసిందట.ఊర్వశితో పాటుగా ఆ సినిమాలో రాయ్ లక్ష్మి కూడా నటించింది. అమ్మడికి కూడా తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ది లెజెండ్ సినిమా వల్ల హీరోయిన్స్ ఇద్దరు సూపర్ గా లాభ పడ్డారని తెలుస్తుంది. ఇంత ఖర్చు పెట్టినా సరే హీరోగా శరవణన్ కి మంచి మార్కులు వేయలేదట ఆడియెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: