రామ్ చరణ్ పై గాసిప్పులు ఉండవు అతడికి సంబంధించినంత వరకు హీరోయిన్స్ తో చాల పద్దతిగా ఉంటాడు అని అతడిని సన్నిహితంగా చూసిన వాళ్ళు చెపుతూ ఉంటారు. చరణ్ కెరియర్ ప్రారంభం నుండి మాస్ హీరోగా ఎదిగాడు కానీ అమ్మాయిల కలల రాకుమారుడు ఇమేజ్ అతడి పై పెద్దగా లేదు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయిన దగ్గర నుండి అతడి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.


ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ లో చూసిన అనేకమంది అమెరికన్ బ్రిటీష్ అమ్మాయిలు చరణ్ అభిమానులుగా మారిపోయి అతడిని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఒక బాలీవుడ్ హీరోయిన్ తనకు చరణ్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.


‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో నటిస్తున్న మూవీలో నటిస్తున్న  అన్వేషి జైన్ చరణ్ పై తన క్రష్ ను బయటపెట్టింది. హిందీలో పాపులర్ అయిన ఫ్యాషన్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న అన్వేషీ జైన్ బాలీవుడ్ సినిమాలలో కూడ నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ‘రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఎక్స్ పోజింగ్ చేయడంలో ఎటువంటి మొహమాటాలు లేని ఈమెకు ఐటమ్ సాంగ్ ఆఫర్స్ బాగా వస్తున్నాయి.


తనకు నచ్చిన హీరోల గురించి మాట్లాడుతూ ‘ఆర్ ఆర్ ఆర్’ లో రామ్ చరణ్ చాల మ్యాన్లీ గా కనిపించాడని చరణ్ ఒప్పుకుంటే అతడితో ఎక్కడికైనా వెళ్ళి డేటింగ్ చేయాలనీ ఉంది అంటూ ఓపెన్ గా చెప్పింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ కావడంతో ఇలాంటి విషయాలకు ఉపాసన ఒప్పుకుంటుందా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పడుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత చరణ్ కు హాలీవుడ్ డైరెక్టర్స్ నుండి కూడ ఆఫర్లు వస్తున్నాయి అంటే ప్రస్తుతం అతడి క్రేజ్ అర్థం అవుతోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: