ప్రస్తుతం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా చిరునవ్వులకు చిరునామా గా మారిపోయింది  జబర్దస్త్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి వారం కూడా ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అలరిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంది చిన్న చిన్న కమీడియన్స్ కూడా ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ కార్య క్రమంలో ఎన్నో ప్రేమ జోడీలు తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇందులో ఏది నిజమో ఏది టిఆర్పి రేటింగ్ కోసం చేసిందో అన్నది మాత్రం ప్రేక్షకులకు అర్ధం కాని విధంగా ఉంటుంది.


అయితే జబర్దస్త్ మొదలైన నాటి నుంచి కూడా సుడిగాలి సుధీర్ రష్మీ  జోడి ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీరి జోడీకి క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరి తర్వాత జబర్దస్త్ లో ఎన్నో జోడీలు తెరమీదకు వచ్చాయి. కానీ ఏ జోడి పెద్దగా క్లిక్ కాలేకపోయింది అనే చెప్పాలి. కానీ జబర్దస్త్ లో ఉన్న కొన్ని జోడీలు టిఆర్పి రేటింగ్ కోసం కాదు నిజమైన ప్రేమలో ఉన్నాయి అనే విషయం మాత్రం కొన్ని కొన్ని సార్లు అర్థమవుతూ ఉంటుంది. ఇక అలాంటి వారిలో జబర్దస్త్ లో బాగా గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు, ఆసియా జోడి కూడా ఉంది అన్నది తెలుస్తుంది.


 ఒకప్పుడు పటాస్ స్టేజి మీద.. తర్వాత  జబర్దస్త్ స్టేజ్ మీద.. శ్రీదేవి డ్రామా కంపెనీ లోను ఆసియా కు ప్రపోజ్ చేశాడు నూకరాజు. అయితే  అప్పటి నుంచి  వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఇటీవల జరిగిన దాంతో వీరిద్దరి లవ్ నిజమే అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ఇంతకీ ఏం జరిగిందంటే జబర్దస్త్ లో ఉన్న కొన్ని జోడీలు ఇటీవలె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లోకి వచ్చారు. ఈ క్రమంలోనే నూకరాజు, ఆసియా కూడా వచ్చారు. అయితే ఈ ప్రోమోలో భాగంగా ఒకానొక సమయంలో నీకు నిజంగా ఆసియా మీద ప్రేమ ఉంటే చేతిలో కర్పూరం వెలిగించుకో అంటూ అడుగుతుంది యాంకర్ సుమ. నిజంగానే నూకరాజు చేతిలో కర్పూరం వెలిగించుకుంటూ నొప్పిని భరిస్తాడు. అంతేకాదు ఇక క్యా స్టేజ్ మీద ఆమెకు తాళికట్టు అని చెప్పడంతో వెంటనే పసుపు కొమ్ము తీసుకుని తాళి కట్టేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: