ఇటీవల థాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఈ సినిమాతో  మెప్పించలేకపోయారు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు చైతన్య. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఇందులో కరీనాకపూర్, అమీర్ ఖాన్ చైతన్య కీలకమైన పాత్రల నటిస్తున్నారు ఇక ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇందులో బోడి బాలరాజు పాత్రలో చైతన్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో చాలా శరవేగంగా పాల్గొంటున్నారు చైతన్య ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న చైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినట్లు సమాచారం సమంతాత విడాకులు తీసుకోవడం ఆ తర్వాత ఎక్కడ కూడా సంబంధం గురించి మాట్లాడకపోవడం జరుగుతోంది అయితే తాజాగా మరొకసారి సమంతతో నటించే విషయంపై ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య సమంతతో కలిసి మళ్ళీ నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.


అందుకు సమాధానంగా చైతన్య స్పందిస్తూ అదే జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది అని.. అయితే అది జరుగుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని కూడా తెలిశారు. ఆ విషయం ఈ ప్రపంచానికే తెలియాలి భవిష్యత్తులో ఏమి.. ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేమని నవ్వుతూ తెలిపారు నాగచైతన్య. గతంలో థాంక్యూ ప్రమోషన్లలో కూడా తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంతాతో అయితే బాగుంటుంది అని తెలియజేశారు. అయితే మరొకవైపు కాఫీ విత్ కరణ్ షో లో సమంత షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. విరాకుల ప్రక్రియ కూడా ఇద్దరి మధ్య సామరస్యంగా జరగలేదని తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లో కలిసి నటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: