2022 ఒక సంవత్సరం జూలై నెల పై తెలుగు సినీ ప్రేమికులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం ఈ జూలై నెలలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. దాదాపు ఆ సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తాయి అని ప్రేక్షకులు ఊహించారు. కానీ జూలై నెలలో విడుదల అయిన మంచి క్రేజ్ ఉన్న నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మొదట జులై 1 వ తేదీన మంచి అంచనాల నడుమ గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక, ప్రేక్షకులను నిరుత్సాహ పరచడం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా విడుదల జూలై 14 వ తేదీన విడుదల అయ్యింది. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ది వారియర్ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ మంచి అంచనాల నడుమ జులై 22 వ తేదీన విడుదలైన అయ్యింది.

సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా జూలై 29 వ తేదీన రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన కలెక్షన్లు దక్కడం లేదు. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: