అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్ధా ఇప్పుడు ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డును అందుకున్న సినిమా ఫారెస్ట్ గంప్ చిత్రానికి ఇది రీమేక్ కాగా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు ప్రఖ్యాతలు గాంచిన అమీర్ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటించగా వేరే స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే మొదటి నుంచి ఈ సినిమాపై ఎందుకో నెగిటివిటీ ప్రబలుతూనే ఉంది. అమీర్ ఖాన్ ప్రతి సినిమాకు ఈ విధమైన నెగెటివిటీ ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే అమీర్ గతంలో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ట్రెండ్ అవ్వడం ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని డిమాండ్ ను లేవనెత్తుతుంది. శివుడి లింగం పై పాలు పోసే బదులు ఆ డబ్బులతో పేదవారికి అన్నం పెట్టవచ్చు కదా అని ఆయన అన్నారు. అయితే దీనిని కొన్ని హిందూ సంఘాలు తప్పుపట్టాయి. ముస్లిం అయిన అమీర్ ఖాన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై వారు తీవ్రంగా తప్పు పట్టారు.

అదే ఒక హిందువు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఇంత సెన్సేషన్ అయ్యేది కాదేమో కానీ అమీర్ ఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వారి మనోభావాలను దెబ్బతీసింది. పీకే సినిమా సమయంలో ఈ వ్యాఖ్యలు. చేయగా అప్పుడు ఎంతో రచ్చ జరగింది. ఇప్పుడు విడుదలవుతున్న ఈ సినిమా సమయంలోను ఆ టాపిక్ తీసుకువచ్చి బాయికాట్  లాల్ సింగ్ చెందా అనే ట్యాగ్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ విధమైన దుష్ప్రచారం ఎంతవరకు ఈ సినిమాకు మైనస్ గా మారుతుందో చూడాలి. ఇంకొక వైపు ఈ సినిమా తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు టీమ్.  కరీనాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఖాన్ త్రయం అగ్ర హీరోలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మిగతా ఇద్దరు ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళరు కానీ అమీర్ మాత్రం ప్రతిసారి ఈ విధమైన కాంట్రవర్సీని నెత్తిన వేసుకొని తన సినిమాలను విడుదల చేస్తూ ఉంటాడు. మరి ఆ కాంట్రవర్సీల ప్రభావం ఈ చిత్రంపై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: