చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు భారీ స్థాయిలో బజ్ నెలకొని ఉంది.. ఇది నందమూరి అభిమానులు ఎంతగానో ఆనంద పరిచే విషయం అని చెప్పాలి. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత అంతటి స్థాయిలో క్రేజ్ ఎవరికి లేదని చెప్పాలి. ఎంతో కొంత ప్రేక్షకులలో మంచి క్రేజీ ఉన్న హీరో కళ్యాణ్ రామ్. సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తూ ఆయన ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతో అలరించారు.  

తాజాగా ఆయన బింబిసారా అనే ఓ చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఆగస్టు 5 వ తేదీన దీనికి సంబంధించిన విడుదల కూడా జరగబోతుంది. ఆ నేపథ్యంలో ఇంతటి భారీ సినిమా తో పోటీ పడుతూ  మరో సినిమా కూడా రావడం ఇక్కడ ఎంతో ఆసక్తికరంగా మారింది. సోలోగా సినిమాను విడుదల చేయడం కోసం మొదటి నుంచి గట్టి ప్రయత్నాలు చేశాడు కళ్యాణ్ రామ్.  కానీ ఎందుకో అది కుదరలేదు. అలా ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామమ్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. భారీ అంచనాల నడుమ ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాటలకు కూడా విశేష స్పందన దక్కింది. అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొనడంతో ఇప్పుడు ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ రెండు చిత్రాలలో ఏది పై చేయి సాధిస్తుందో తెలియాలి అంటే ఆగస్టు 5వ తేదీ వరకు వేచి చూడవలసిందే. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను భారీ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్న కళ్యాణ్ రామ్ సినిమాపై ప్రేక్షకులలో ఎంతగానో అంచనాలు ఉన్నాయని చెప్పాలి. ఇటు సీతారామమ్ సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: