హీరోయిన్స్ ఎక్కువగా తమ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ అప్పుడప్పుడు కొన్ని సాహసాలను కూడా చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ రాధిక కుమారస్వామి పలు చిత్రాలలో నటించి మంచి నటిగా పేరుపొందింది అయితే గడిచిన కొద్ది రోజుల నుండి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నది కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రాధిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.


ఇక రాధిక ఎంతో ఉత్సాహంతో డాన్స్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలడం ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది. ఈ వీడియోలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి జిమ్ములో డాన్స్ వేస్తున్న రాధిక మాస్ స్టెప్పులతో అభిమానులకు ప్రేక్షకులకు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. అలా చేస్తున్న సమయంలోనే ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కింద పడడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా అవుతుంది.

గతంలో హీరోయిన్ రాధిక డాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ గా మారాయి ఇంతకుముందు బీచ్ లో కూడా బాద్షా పాట జగ్నో పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది. ఇక 2002లో నీలా మేఘ శయ అనే కన్నడ చిత్రంతో మొదటిసారిగా చిత్ర సీమకు ఎంటర్ ఇచ్చింది రాధిక ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది రాధిక మొదటి భర్త రతన్ కుమార్ ఆగస్టు 2002లో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇక ఆ తర్వాత 2010 సంవత్సరంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిని రెండో వివాహం చేసుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నాది.

మరింత సమాచారం తెలుసుకోండి: