టాలీవుడ్ జంట సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే .అయితే  వీరిద్దరూ విడాకులు ప్రకటన ఇచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ వీరివిడాకులు గురించి నిత్యం ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.ఇకపోతే తాజాగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.కాగా ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే పెళ్లి విడాకుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక సమంత ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విడాకులు సామరస్యంగా జరగలేదని విడాకుల సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని తెలిపారు.

అయితే  అదేవిధంగా తాను నాగచైతన్య నుంచి భరణం కింద ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నన్ను నాగచైతన్యను ఓకే గదిలో కనక పెడితే చుట్టూ ఎలాంటి మారనాయుధాలు లేకుండా చూసుకోవాలని ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. ఇకపోతే సమంత ఈ విధంగా చైతన్య గురించి మాట్లాడటంతో చైతన్య అంత చేయకూడని తప్పు ఏం చేశారు అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.ఈ షో చూస్తున్న నాగ చైతన్య సమంత మాటలకు ఎంతో బాధపడ్డారని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే సమంత పై కోపంతో నాగచైతన్య సమంత జ్ఞాపకాలన్నింటిని చెరిపేసినట్టు తెలుస్తుంది.

పోతే సమంతతో నాగచైతన్య కలిసి దిగినటువంటి ప్రవేట్ ఫోటోలను చింపేశారని సమాచారం. అయితే ఇదే కాకుండా సమంత నాగచైతన్య కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ఏం మాయ చేసావే సినిమా నుంచి వారిద్దరు కలిసి నటించిన సినిమాల అగ్రిమెంట్లను కూడా నాగచైతన్య చింపేశారని తెలుస్తోంది.ఇకపోతే సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోవడంతో నాగచైతన్య కూడా లోలోపల ఎంతో బాధపడుతున్నారని సమాచారం.అయితే  మొత్తానికి సమంత నాగచైతన్య ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పాలి.ఇదిలావుంటే  ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా పనులతో ఎంతో బిజీగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: