ఝుమ్మంది నాదం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. నటనకే ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నది. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ బాలీవుడ్లో మాత్రం ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక తన అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తూ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందింది.


తాజాగా తాప్సి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్నది. తాజాగా తన 36వ పుట్టినరోజును జరుపుకుంటుంది ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సి తన 12 ఏళ్ల సినీ ఇండస్ట్రీ కెరియర్లు మహిళల పట్ల వ్యవహరించే తీరులో పెద్దగా ఎలాంటి మార్పు లేదని ఆమె తెలియజేయడం జరిగింది. మహిళల పట్ల తిని పరిశ్రమంలో చాలా వివక్షత ఉంది అని తన కెరియర్ ప్రారంభం నుంచి ఇది చూస్తూనే ఉన్నానని తెలియజేసింది. షూటింగ్ లోకేషన్ దగ్గర నుంచి అకాడమీషన్ ఇతర సౌకర్యాలు రెమ్యూనరేషన్ వరకు అందరూ కూడా ఫిమేల్ ,మెయిల్ అనే తేడాలని చూపిస్తూ ఉన్నారని ఆమె తెలియజేసింది.


స్టార్స్ ను ఒక విధంగా మిగతా వాళ్లను మరొక విధంగా చూస్తూ ఉంటారని తెలియజేసింది తాప్సి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఇచ్చే కార్వాన్లు అగ్గిపెట్టెలా ఉండేవి అని.. అదే హీరోలకు పేరు ఉన్న నటీనటులకు అయితే డబల్ డోర్ వెహికల్స్ ఏర్పాట్లు చేస్తారని తెలియజేసింది. ఇక హీరోయిన్గా ఒక స్టార్డం వచ్చిన తర్వాత అందరి పరిస్థితిలో మార్పులు వస్తాయని తెలిపింది తాప్సి కానీ ఎంత మార్పు వచ్చిన హీరో కంటే తక్కువగానే చూస్తారని ఆమె తెలియజేసింది హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: