సినీ ఇండస్ట్రీలో “ఏం మాయ చేసావే” సినిమాతో నాగచైతన్య తన కెరియర్ లో ఫస్ట్ హిట్ అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే చాలామందిని ఆకట్టుకుంది.ఇకపోతే ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమలో పడటం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించడం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కాగా ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ జంటగా నాగచైతన్య మరియు సమంతకి మంచి పేరుంది.అయితే కానీ అనూహ్యంగా పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు గత ఏడాది అక్టోబర్ నెలలో విడిపోవడం జరిగింది.

 ఇక  ఇద్దరు ఏ కారణంగా విడిపోయారు అనేదానిలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు.ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో… యాదృచ్ఛికంగా ఇద్దరు తీసుకున్న నిర్ణయం కాదని చాలా జరిగింది అన్నట్టు సమంత కొద్దిపాటి మాటలతో తెలిపింది.ఇక  పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇటీవల ఇంటర్వ్యూలో నాగచైతన్యకి వెరైటీ ప్రశ్న ఎదురయింది.అయితే  ఒకవేళ భవిష్యత్తులో సమంతాతో.. వర్క్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు..? దానికి నాగచైతన్య నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కాగా ఇది క్రేజీ ఐడియా.. కానీ ఏదైనా జరగొచ్చు చూద్దామని అన్నారు. ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవటం అసహనంగా ఉందని తెలిపారు.

ఇకపోతే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుందని హీరో నాగచైతన్య స్పష్టం చేశారు. ఇక సమంతతో విడాకులపై ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఇక విడాకులకు గల కారణాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని అన్నారు.పోతే ఇప్పుడు సమంత దారి సమంతదే. నా దారి నాదే. అయితే ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సింది ఏమీ లేదని సోషల్ మీడియా లో వస్తున్న ఊహగానాలకు స్పందించాల్సిన అవసరం లేదని నాగచైతన్య కరాకండిగా తేల్చేశారు.ఇదిలావుంటే ఇక వీరు ఇద్దరు వారి విడాకుల అనంతరం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.ఇకపోతే సమంత అయితే ఫుల్ ఫామ్ లో ఉంది.అంతేకాదు ఎన్నడూ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఆమె సొంతం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: