మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించగా , రాజేష విజయన్ , దివ్యాంశ కౌశిక్ ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ జూలై 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు తో పోలిస్తే ఈ సినిమాకు ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు మూడు రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.
 
నైజాం : 1.21 కోట్లు ,
సీడెడ్ : 64 లక్షలు ,
యూ ఏ : 54 లక్షలు ,
ఈస్ట్ : 37 లక్షలు ,
వెస్ట్ : 20 లక్షలు ,
గుంటూర్ : 31 లక్షలు ,
కృష్ణ : 23 లక్షలు ,
నెల్లూర్ : 15 లక్షలు ,
3 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ మూవీ 3.65 కోట్ల షేర్ , 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 0.30 కోట్లు .
ఓవర్ సీస్ లో : 43 లక్షలు .
మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రామారావు డ్యూటీ మూవీ 4.38 కోట్ల షేర్ , 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: