కన్నడ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిచ్చ సుదీప్ తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.

సినిమా మంచి విజయం సాధించడం , అలాగే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన సుదీప్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో సుదీప్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత బాహుబలి , సైరా నరసింహారెడ్డి మూవీ లలో నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇదినిల ఉంటే తాజాగా సుదీప్ 'విక్రాంత్ రోనా' అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో కూడా  విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మంచి వసూలు లభిస్తున్నాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 1.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమాకు మొదటి రోజే మంచి టాక్ రావడంతో ఈ మూవీ అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం లాభాలను తీసుకుంటుంది.  ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికీ 2.92 కోట్ల షేర్ , 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీంతో ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.42 కోట్ల లాభాలను సాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: