గోపీచంద్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలు జిఏ 2 పిక్చర్స్ ఓనర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. జులై ఒకటవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పరవాలేదు అనిపించుకుంది కానీ కలెక్షన్లలో మాత్రం అంతగా రాబట్టలేక పోయింది. మొత్తంగా మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించిన ఈ సినిమా సెకండ్ వీకెండ్ వచ్చేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సప్తగిరి, సత్యరాజ్ ,వరలక్ష్మి శరత్ కుమార్ రావు రమేష్ తదితరులు నటించారు. పక్కా కమర్షియల్ సినిమా క్లోసింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.62 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-1.36 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.40 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-70 లక్షలు.
5). వెస్ట్-57 లక్షలు.
6). గుంటూరు-66 లక్షలు.
7). కృష్ణ-70 లక్షలు.
8). నెల్లూరు-50 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.8.51 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-55 లక్షలు.
11). ఓవర్సీస్-95 లక్షలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ.10.1 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక పక్క కమర్షియల్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే రూ.17.5 కోట్ల రూపాయలకు జరగగా ఈ సినిమాని గీత ఆర్ట్స్ మూవీ క్రియేషన్ వారు సొంతంగా కొన్ని ఏరియాలలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 18 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది అయితే ఈ సినిమా ముగిసే సమయానికి రూ.10.1 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది దీంతో ఈ సినిమా యావరే స్టాక్ గా నిలిచింది. ఇక భారీ వర్షాలు వంటివి కారణంగా ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని చెప్పవచ్చు ఈ సినిమా జూలై నెలలో విడుదలై కొంతైనా పర్వాలేదనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: