గత కొన్నేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలేవీ థియేటర్లలో విడుదల కాలేదు. అయితే కొన్ని నెలల గ్యాప్ లోనే నిఖిల్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయట..


నిఖిల్ నటించిన కార్తికేయ2 ఎన్నో అవాంతరాలను దాటుకుని ఆగష్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారట.. నిఖిల్ వైవాహిక జీవితానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.


అయితే ఆ వార్తలపై స్పందించిన నిఖిల్ వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తన వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోందని చెప్పుకొచ్చారట.. తన వైవాహిక జీవితం గురించి వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తండ్రిని కోల్పోవడం తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని నిఖిల్ పేర్కొన్నారు. పిల్లలను పెంచి పిల్లలు ప్రగతి సాధించిన తర్వాత ఆనందించాల్సిన సమయం లేకుండా తండ్రి మరణించడం బాధను కలిగించిందని నిఖిల్ చెప్పుకొచ్చారట.


 


పిల్లలు వాళ్ల తల్లీదండ్రులు జీవించి ఉన్న సమయంలోనే వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని నిఖిల్ కామెంట్లు చేశారు. కార్తికేయ2 మూవీని ద్వారకలో షూట్ చేయడం మరిచిపోలేని అనుభూతి అని నిఖిల్ చెప్పుకొచ్చారు. ఇస్కాన్ మందిరంలో కార్తికేయ2 టీజర్ ను లాంఛ్ చేయడం దేవుని కృప అని నిఖిల్ పేర్కొన్నారట.18 పేజెస్, సుధీర్ వర్మ సినిమా, మరో సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయని నిఖిల్ అన్నారట..


 


నిఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు నిఖిల్ కు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: