టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురి లో దిల్ రాజ్ ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ఇండస్ట్రీలో తన పట్టును నిలుపుకుంటున్న ఈ బడా నిర్మాత త్వరలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తాడని వచ్చే సంవత్సరం జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ఎమ్ ఎల్ ఏ గా పోటీ చేస్తాడు అన్న ప్రచారం కూడ జరగబోతోంది.


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు అన్ని నిర్మాతల మండలి ఇచ్చిన పిలుపుతో ఆగిపోవడంతో ఫిలిం స్టూడియోలు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పెద్ద నిర్మాతల నుండి చిన్న నిర్మాతల వరకు అందరు తమతమ సినిమాల షూటింగ్ లను రద్దు చేసుకుంటే దిల్ రాజ్ మాత్రం తాను ప్రస్తుతం తమిళ విజయ్ తో తీస్తున్న మూవీ షూటింగ్ వైజాగ్ షెడ్యూల్ ను కొనసాగిస్తాడు అన్న గాసిప్పులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.


ఇలా గాసిప్పుల హడావిడి మొదలు కావడానికి ఒక ఆసక్తికరమైన టెక్నికల్ కారణం కనిపిస్తోంది. విజయ్ తో దిల్ రాజ్ తీస్తున్న సినిమా ద్విభాషా చిత్రం. ఈ సినిమాను తమిళంలో తీస్తూ తెలుగులో కూడ డబ్ చేయబోతున్నారు. షూటింగ్ ల నిలుపుదల అన్నది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాబట్టి ఈ షూటింగ్ ల నిలుపుదల కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి వర్తించదు అన్న పాయింట్ తో ఈమూవీ వైజాగ్ షెడ్యూల్ ను కొనసాగిస్తారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.


ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినప్పటికీ అలాంటి ప్రత్యేక హోదాను దిల్ రాజ్ కు నిర్మాతల మండలి ఇస్తుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అదే జరిగితే షూటింగ్ లు ఆపుకున్న నిర్మాతలు ఇలా రకరకాల టెక్నికల్ కారణాలు చూపెడుతూ తమ షూటింగ్ లను కొనసాగిస్తే నిర్మాతల మండలి ఇచ్చిన పిలుపుకు అసలువు విలువ ఏముంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ షూటింగ్ ల నిలుపుదల విషయమై మరిన్ని ట్విస్టులు వచ్చే అవకాశం ఉంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: