2022 వ సంవత్సరంలో జూన్, జులై నెలలో తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ మూవీ ని మినహాయిస్తే, మిగతా అన్ని తెలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచాయి. మొదటగా జూన్ 3 వ తేదీన అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో  తెరకెక్కిన మేజర్ సినిమా విడుదలై ఘన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.

ఆ తర్వాత జూలై 10 వ తేదీన నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన అంటే సుందరానికి  మూవీ మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ తర్వాత జూన్ 17 వ తేదీన దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన విరాట పర్వం సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత జూలై 1 వ తేదీన గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ మూవీగా మిగిలిపోయింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ది వారియర్ మూవీ జూలై 14 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. 

ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన థాంక్యూ మూవీ జూలై 22 వ తేదీన విడుదల.అయ్యింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా జూలై 29 వ తేదీన రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి మూవీ యూనిట్ ఆశించిన కలెక్షన్లు దక్కడం లేదు. జూన్ , జూలై నెలలో విడుదల అయిన ఏ తెలుగు సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: