ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలపై  ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకుంటే, మరి కొన్ని సినిమాలు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా  విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆగస్ట్ నెలలో విడుదల కు రెడీ గా ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

మొదటగా ఆగస్ట్ 5 వ తేదీన సీతా రామం మరియు బింబిసార సినిమాలు విడుదల కాబోతున్నాయి. సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాలిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 11 వ తేదీన హిందీ సినిమా అయినా లాల్ సింగ్ చడ్డా విడుదల కాబోతుంది. అమీర్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించగా నాగ చైతన్య ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. స్వాతిముత్యం సినిమా ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కాబోతుంది. తిస్ మర్ ఖాన్, వాంటెడ్ పండుగాడు, మాట రాని మౌనమిది, కమిటెడ్,  సినిమాలు ఆగస్ట్ 19 వ తేదీన విడుదల కాబోతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా  ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతుంది. కాలాపురం సినిమా  ఆగస్ట్ 26వ తేదీన విడుదల కాబోతుంది. పిశాచి 2 మూవీ ఆగస్ట్ 31వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: