కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చెప్పలేం ఫెర్నాండెజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , అనూప్ బండారి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ,  సుదీప్ మరియు షాలిని ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని 3 డి లో నిర్మించారు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు ,  హిందీ ,  మలయాళ , తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.  అందులో భాగంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు , థియేటర్ రన్  కొన్ని వారాలు ముగిసిన తర్వాత జీ 5 'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: