ఇక సినిమా ఏదైనా సరే ఒక రిలీజ్ డేట్ ప్రకటించాక దానికే కట్టుబడతారన్న గ్యారెంటీ ఏ మాత్రం ఉండటం లేదు.ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితులు కూడా నిర్మాతలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి.దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు కూడా తప్పడం లేదు.ఇక విజయ్ దేవరకొండ సినిమా ఖుషిని గతంలో డిసెంబర్ రిలీజని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడా స్లాట్ ని వదులుకోబోతున్నట్టు లేటెస్ట్ గా అందిన అప్ డేట్. దాని స్థానంలో అఖిల్ ఏజెంట్ సినిమాని అదే నెల 23 విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం.అలాగే ఖుషి షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. లైగర్ ప్రమోషన్ల కోసం విస్తృతంగా తిరుగుతున్న రౌడీ హీరో ఇంకో నెల దాకా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఖుషి సినిమా కొంత భాగమే ఉన్నప్పటికీ హడావిడి చేయడం ఇష్టం లేక దాన్ని జనవరి ప్రారంభంలో లేదా రిపబ్లిక్ డే సందర్భంగానో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మైత్రి నుంచి వస్తున్న లీక్.ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ వాయిదా అనేది ఫిక్స్ అయినట్టే.


మరోవైపు ఈ ఆగస్ట్ నెల నుంచి డ్రాప్ అయ్యాక ఏజెంట్ కి అక్కినేని సెంటిమెంట్ డిసెంబర్ కంటే బెటర్ ఆప్షన్ అనేది కనిపించడం లేదు. నిన్నటి నుంచి మొదలైన షూటింగుల బందు తాలూకు పరిణామాలు కూడా ఇలాంటి వాటి మీద ఇంకా ఉండబోతున్నాయి.ఇక దసరాతో మొదలుపెట్టి 2023 సంక్రాంతి దాకా ఆల్రెడీ లాక్ చేసుకున్న రిలీజుల్లో చాలా మార్పులు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ వీలైనంత త్వరగా బంద్ ముగిసిపోతే ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అలా కాకుండా ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఈ మార్పుల పర్వం భారీ స్థాయిలో ఉండబోయేది మాత్రం చాలా వాస్తవం. ఇప్పుడీ ఖుషి-ఏజెంట్ సినిమాలల మార్పిడి కూడా అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: