టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ 19 ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ చిన్న చూపు చూశారు. 'కుర్రాడు.. వీడేం మ్యూజిక్ కొడతాడు ?' అంటూ ఆయన్ని హేళన కూడా చేశారు. కానీ.. ఆ తర్వాత తను కంపోజ్ చేసిన దేవి సినిమా పాటలు రిలీజ్ అయ్యాక.. ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయ్యింది. 'ఏమిటి 19 ఏళ్ల కుర్రాడు ఈ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడా ? ఎవరు ఆ కుర్రాడు ?' అంటూ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఆ రోజుల్లో చాలా పెద్ద చర్చే జరిగింది.ఇక ఆ రేంజ్ లో దేవి సినిమా పాటలు క్లాసిక్ గా నిలిచిపోయాయి. అయితే సంగీతానికి వయసు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం అని నిరూపించి 19 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచం లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.ఇక దేవి సంగీతం ఉత్తేజాన్ని కలిగిస్తోంది, దేవి స్వరం ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇక దేవి సంగీతంలో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో.. బయట దేవి శ్రీ ప్రసాద్ అంత సరదాగా కూడా ఉంటాడు. ఈరోజు దేవి శ్రీ ప్రసాద్ 43 వ పుట్టినరోజు.దేవి దాదాపు 100 సినిమాలకు మ్యూజిక్ దేవి. ఇంకా అలాగే 60 పాటలు వరకు పాడాడు. మెలోడీ సాంగ్స్ తో పాటు ఎగిరి స్టెప్పులు వేసే మాస్ బీట్ కొట్టడంలో కూడా ఈ రాక్‌ స్టార్‌ కు ఎవరూ సాటి రారు. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవి నిజానికి ఒక మ్యూజిషన్ అయినా కానీ నిజానికి అతనో ఒక మేజిషన్. అంతలా తన పాటతో దేవి మాయ చేస్తాడు.


 1979 వ సంవత్సరం ఆగస్టు 2న సత్యమూర్తి, శిరోమణి దంపతులకి జన్మించాడు దేవి శ్రీ ప్రసాద్. చిన్నప్పటి నుంచి సంగీతమంటే చాలా ఆసక్తి చూపిస్తుండటంతో మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్పించారు.ఆ తర్వాత ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ దగ్గర శిష్యరికం చేశారు. అయితే, ముందుగా దేవిలో టాలెంట్ ఉందని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి లెజెండరి దర్శకుడు కోడి రామకృష్ణ. నిజానికి రాక్ స్టార్ అసలు పేరు శ్రీ ప్రసాద్. కోడి రామ కృష్ణ తన 'దేవి' సినిమాలో శ్రీ ప్రసాద్ కి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి అతన్ని 'దేవి శ్రీ ప్రసాద్'ను చేశారు. ఆ సినిమా తర్వాత దేవికి 'ఆనందం' సినిమాతో దేవికి భారీ బ్రేక్ వచ్చింది. అప్పుడు రాక్ స్టార్ అయిపోయాడు.ఆ తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇంకా బొమ్మరిల్లు చిత్రాలకి గాను దేవికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఇంకా పవర్ స్టార్ 'అత్తారింటికి దారేది' సినిమాకి నంది అవార్డు లభించింది. ఇంకా దేవిలో గేయ రచయితగా కూడా ఉన్నాడు. అయితే, ఐటమ్ సాంగ్ లకి దేవి మంచి స్పెషలిస్ట్. ఇక ఇన్ని సినిమాల్లో వందల పాటల్లో దేవికి 'నాన్నకు ప్రేమతో' పాట అంటే మాత్రం చాలా ప్రత్యేకం. తన తండ్రి పై ఉన్న ప్రేమతో నాన్నకు ప్రేమతో పాటను రాసి తానే స్వయంగా తమ్ముడు సాగర్ తో కలిసి పాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: