బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా సక్సెస్‌ అయిన షో 'కాఫీ విత్‌ కరణ్' టాక్‌ షో.


ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో బాగా దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో పార్టిస్‌పేట్‌ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడట ఈ స్టార్ ప్రోడ్యూసర్‌. ఇటీవలిటీ ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్‌ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్‌ ప్రొమోను బయటకు వదిలారట.


ఈ ఎపిసోడ్‌లో 'లాల్‌ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్‌ జోహర్‌ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చిందట.. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్‌ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్‌ అనడంతో షోలో నవ్వులు కురిశాయట..


 


కాగా అమీర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్‌ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుందట.హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ అయిన 'ఫారెస్ట్ గంప్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించారు.తెలుగులో కూడా చాలా నాగ చైతన్య నటించడంతో సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అమీర్ ఖాన్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: