రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు.రాంగోపాల్ వర్మ తాను ఏ విషయంలోనైనా కూడా విభిన్నమని ఆయన ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే అంతా ఒకవైపు అయితే తాను మాత్రం మరో వైపు అన్నట్టు ప్రతి విషయంలో కూడా ఆయన వ్యవహరిస్తారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు గురించి మన అందరికీ కూడా తెలిసిందే. ఓటీటీల కారణంగా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడుతుందని నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేసిన తర్వాత కొంచెం ఆలస్యంగా డిజిటల్ మీడియాలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.ప్రస్తుతం నిర్మాతలు అందరూ కూడా కలిసి సినిమాలను తొందరగా ఓటీటీలలో విడుదల చేయటం వల్ల థియేటర్ కు వచ్చి సినిమాలను చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని అందుకోసమే ఆలస్యంగా సినిమాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


అయితే ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి జొమాటోలను హోటల్ నిర్వాహకులు ఇంకా అలాగే యాజమాన్యాలు బ్యాన్ చేయాలని అంటే ఎలా ఉంటుందో నిర్మాతలు కూడా ఓటీటీలను బ్యాన్ చేయమని చెప్పడం అలాగే ఉంది అంటూ ఈయన వెల్లడించడం జరిగింది.ఇక ఇలా థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపని వారు సినిమాని ఎప్పుడు ఓటీటీలలో ఇంకా టీవీలలో ప్రసారం చేసిన చూస్తారు కానీ థియేటర్ కి మాత్రం రారని ఈయన వెల్లడించారు.మరి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో ఏమో కానీ నెటిజన్స్ మాత్రం రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ వెరీ రీజనబుల్ అని ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV