గత రెండు నెలలుగా విడుదల అవుతున్న సినిమాలకు కనీసం ఓపెనింగ్ కలక్షన్స్ కూడ సరిగ్గా రావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు తలలు పట్టుకుంటున్నారు. నాని రవితేజా నాగచైతన్య రామ్ లు నటించిన సినిమాలు కూడ ఫెయిల్ అయ్యాయి. దీనితో సినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వస్తే కాని జనం ధియేటర్లకు రారా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు కలుగుతున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఎవరూ ఊహించని విధంగా కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ మూవీ అడ్వాన్స్ టిక్కెట్లకు బుక్ మై షో యాప్ లో వస్తున్న స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. ఈమూవీ విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ చాలామంది ఈమూవీ మొదటిరోజు మొదటి షో టిక్కెట్లు కొనుక్కోవడానికి చూపెడుతున్న ఉత్సాహం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


కళ్యాణ్ రామ్ కెరియర్ లో హిట్ ఇచ్చిన సినిమాలు రెండే రెండు కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ‘పటాస్’ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సస్ అన్న పదం అతడి కాంపౌండ్ దరికి చేరలేదు. అయినప్పటికీ తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై సినిమాలు తీసి కళ్యాణ్ రామ్ ఆర్థికంగా కూడ కొంతవరకు ఇబ్బంది పడ్డాడు అన్న గాసిప్పులు హడావిడి చేసాయి. అయితే కళ్యాణ్ రామ్ కు తాను ఒక సూపర్ హిట్ కొట్టి చూపెట్టాలి అన్న తపనతో దాదాపు మూడు సంవత్సరాల క్రితం కరోనా పరిస్థితులు ఎదురవ్వక ముందు ప్రారంభం అయిన ‘బింబిసార’ ఇప్పటికి విడుదల అవుతోంది.


జూనియర్ మాటలలో చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకోసం రక్తం ధారపోసాడట. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరియర్ ‘బింబిసార’ ముందు ‘బింబిసార’ తరువాత అన్న విధంగా ఉంటుందని స్వయంగా జూనియర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈసినిమా హిట్ అయితే కళ్యాణ్ రామ్ కోరుకున్న విధంగా కళ్యాణ్ రామ్ తాను నటిస్తూ జూనియర్ బాలకృష్ణ లతో కలిపి ఒక మల్టీ స్టారర్ తీయాలి అన్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: