అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ మూవీ హ్యాపీ డేస్  సినిమాతో నటుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇక ఈ సినిమాలో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకొని నిలబడ్డాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కొనసాగుతున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో కార్తికేయ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు నిఖిల్.


 ఇటీవలే ఓ ప్రమోషన్ లో పాల్గొన్న హీరో నిఖిల్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. హ్యాపీ డేస్ సినిమా తో నా తొలి సంపాదన మొదలయింది అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక హ్యాపీ డేస్ మూవీ చేస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల తనకు 25 వేలు పారితోషికం ఇచ్చారూ అంటూ తెలిపాడు నిఖిల్. అయితే ఇక హ్యాపీ డేస్ లో నలుగురిలో నేను ఒకడిగా సెలెక్ట్ అయ్యాను. కానీ హీరో క్యారెక్టర్ కావాలంటే మాత్రం లక్ష రూపాయలు ఇవ్వాలి అన్నారు. ఇక ఆ పాత్ర నాకే రావాలనే ఆశ తో లక్ష రూపాయలు ఇచ్చాను అంటూ షాకింగ్ విషయం చెప్పుకొచ్చాడు.


 అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అన్న టాక్ ఎన్నో రోజుల నుంచి ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు నిఖిల్ సిద్దార్థ్  చెప్పిన మాట తో ఇది నిజమే అన్నది ఎంతో మంది నమ్ముతున్నారు. ఇకపోతే నిఖిల్ కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఇప్పటికే వచ్చిన కార్తికేయ మంచి విజయాన్ని సాధించింది. నిఖిల్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: