టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయిన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా , నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కళ్యాణ్ రామ్ ఆఖరుగా ఎంత మంచి వాడవురా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతున్న బింబిసార మూవీ కనుక మూవీ యూనిట్ అనుకున్న అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నట్లు అయితే ఈ మూవీ ని ఆగస్ట్ 18 వ తేదీన లేదా ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కళ్యాణ్ రామ్మూవీ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. మరి కళ్యాణ్ రామ్మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో ,  ప్రేక్షకులను ఈ మూవీ తో ఏ మేరకు అలరిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: