లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా  సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్న కమల్ హాసన్ తాజాగా విక్రమ్ అనే సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత బాక్సా ఫీస్ దగ్గర విక్రమ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. జూన్ 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయిన విక్రమ్ సినిమా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ ,  సూర్య ఈ సినిమాలో  కీలక పాత్రలలో నటించారు. విక్రమ్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ హాసన్ మరి కొన్ని రోజుల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారతీయుడు 2 నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ మరో క్రేజీ దర్శకుడితో మూవీ ని లైన్ లో పెట్టె పనిలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అజిత్ హీరోగా తెరకెక్కిన వాలిమై మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హెచ్ వినోద్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా పొలిటికల్ డ్రామా జోనర్ లో తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: