గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినా రాశి కన్నా గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ మూవీ ల ద్వారా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే అనే తెలుగు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని , అలాగే మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది. 

ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన రాశి కన్నా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలోనే రాశి కన్నా తెలుగు లో నటించిన పక్కా కమర్షియల్ , థాంక్యూ సినిమాలు విడుదలయ్యాయి.  ప్రస్తుతం రాశి కన్నా తెలుగు తో పాటు హిందీ , తమిళ ఇండస్ట్రీ లపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన సర్దార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా ,  హిందీ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా రాశి ఖన్నా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ గ్లామరస్ బ్యూటీ ఎల్లో కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ ఎల్లో కలర్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: