అందాల రాక్షసి అనే ఒక సాదా సీదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు హను రాఘవపూడి ఇక కథలో కొత్తదనం తో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అందాల రాక్షసి సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఊపులో ఆ తర్వాత పలువురు హీరోలతో సినిమాలు చేశాడు ఈ డైరెక్టర్. కానీ కమర్షియల్ హిట్ కొట్టడం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి. అందాల రాక్షసి తప్ప ఆయన కెరీర్లో చేసిన మూడు సినిమాలు పెద్దగా చెప్పుకోదగ్గవి కాదు అనే చెప్పాలి.  శర్వానంద్ తో పడి పడి లేచే మనసు అనే డిఫరెంట్ లవ్ స్టోరీ ప్లాన్ చేసి  మళ్లీ నిరాశ పడిన హను రాఘవపూడి నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.


 మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మృనాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా సీతారామం అనే సినిమా తెరకెక్కింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ సీతారామం టైటిల్కు యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే క్యాప్షన్ జోడించడం ఆడియన్స్ ని మరింత ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో దర్శకుడు హను రాఘవపూడి పై ఒక టాక్ వినిపిస్తోంది.



 ఇప్పటివరకు హను రాఘవపూడి 10 ఏళ్ల కెరీర్లో చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే. ఇందులో సూపర్ హిట్ సినిమాలు కూడా లేవు. ఈక్రమంలోనే హను రాఘవపూడి ఇదే చివరి సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సీతారామం సినిమా హిట్ కొడితేనే అతడికి నెక్స్ట్ సినిమా ఉంటుందని లేదంటే అతడి కెరియర్రిస్క్ లో పడిపోతుంది అన్నది తెలుస్తుంది. ఒకవేళ సీతారామం కూడా ఫ్లాపయితే ఏ హీరో కూడా ఇతని తో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవచ్చుఅన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది అని చెప్పాలి. మరి సీతారామం సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: