టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన నిఖిల్  తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది.

కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ మూవీ ని కొంత కాలం క్రితం జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడిన సందర్భంలో ఈ సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయడం లేదు అని , ఆగస్ట్ 12 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్ట్ 12 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది.

ఈ సినిమాను ఒక రోజు వాయిదా వేసి ఆగస్ట్ 13 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొద్ది గంటల్లో కార్తికేయ 2 మూవీ బృందం ప్రెస్ మీట్ సమావేశంలో పాల్గొననున్నట్లు ,  సినిమా వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి కాలభైరవ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: