నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయాలను బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కళ్యాణ్ రామ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార  అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో  కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.  నైజాం 5 కోట్లు , సీడెడ్ 2 కోట్లు , ఆంధ్ర 6.50 కోట్లు . మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 13.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.1 కోట్లు , ఓవర్ సీస్ లో 1 కోటి . ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది ఈ సినిమా 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: