ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిన చాలామంది హీరోయిన్లు వివాహం బాటపడుతున్నారు.అయితే  ఈ క్రమంలోనే అల్లు అర్జున్ దేశముదురు మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన నటి హన్సిక తను నటించిన మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది.ఇకపోతే ఈమె ఒక్క సినిమాతోనే అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో హన్సికకు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి. అయితే  ఇక ఈ మూవీ తర్వాత హన్సిక నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో టాలీవుడ్

 ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి.ఇక దీంతో ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపింది. ఇకపోతే  కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలతో అగ్ర హీరోలందరితో చేసి సక్సెస్ అందుకొని అగ్రహీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కాగా ఈ క్రమంలోనే హన్సిక కు చాలా మంది హీరోలతో ఎఫైర్ లు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. కాగా ఈమె పెళ్లిపీటలు ఎక్కబోతోంది అని వార్త ట్రోల్ అవుతోంది.

ఇకపోతే ఈ క్రమంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకునేది ఎవరిని అనే విషయం తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం పెరిగింది. అయితే ఈ క్రమంలోనే హన్సిక ఇండస్ట్రీకి చెందిన వారిని కాకుండా పొలిటికల్  బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు వస్తున్నాయి.కాగా  ఒక పెద్దింటి కుటుంబానికి హన్సిక కోడలిగా వెళ్లిబోతుందని తెలుస్తోంది.పోతే  ఇప్పటికైనా పెళ్లికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ పెద్దలు కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారని త్వరలోనే నిశ్చితార్థానికి సంబంధించిన వార్త కూడా బయటకు రాబోతోందని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం హన్సిక సినిమాల విషయానికొస్తే..' మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: