టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన rrr సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రాజమౌళి దర్శకత్వంలో, ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా తో వీరి ఇద్దరి క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.అయితే   ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు నెలలు అవుతున్న తర్వాతి సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.పోతే ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కాగా… 

మొదటి సినిమా జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే  కొరటాల శివ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు.ఇదిలావుంటే ఇక.. ఈ చిత్రం గురించి అధికారికంగా అనౌన్స్ కాలేదు కానీ సినిమా అయితే ఉందని రీసెంట్ కన్ఫర్మ్ అయింది.ఇకపోతే కొరటాల చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా ప్లాఫ్ అవడంతో తన కెరియర్ కొంచెం చిక్కుల్లో పడింది. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ తో తీసే సినిమాతో ఎలా ? అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే చాలా కష్టపడి మరి స్క్రిఫ్ట్‌ రెడీ చేస్తున్నాడు.

ఇక  ఇదే క్రమంలో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కూడా మూవీ అనౌన్స్ చేశాడు. అయితే ఇదే క్రమంలో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి .ఇకపోతే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. కాగా ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.పోతే  కొరటాల శివతో పాటు బుచ్చిబాబు సినిమా కూడా ఒకేసారి మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ఇక రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొనేటట్టు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక దీనిపై అధికారికంగా క్లారిటీ రావాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: