ప్రముఖ నటులలో ఒకరు అయిన దుల్కర్ సల్మాన్ తాజాగా సీతా రామం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా , మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ యూనిట్ భారీగా ఏర్పాటు చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల గురించి తెలుసుకుందాం. నైజాం 5 కోట్లు , సీడెడ్ 2 కోట్లు , ఆంధ్ర 7 కోట్లు . రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం సినిమా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 70 లక్షలు , ఓవర్ సీస్ లో 2.5 కోట్లు , ఇతర భాషలలో 1.50 కోట్లు . మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 18.70 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా , 19.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: