మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ ఇప్పటికే నేరుగా తెలుగు సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా తాను ఇతర భాషల్లో నటించిన చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా దుల్కర్ సల్మాన్ సీతా రామం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించగా , హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నారు. అందులో భాగంగా దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ... పాన్ ఇండియా అనే ట్యాగ్ ని విని విని విసుగొచ్చింది. పాన్ ఇండియా అనే పదాన్ని వాడకుండా ఒక ఆర్టికల్ కూడా ఉండడం లేదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది నిజానికి కొత్తదేమీ కాదు.  అమితా బచ్చన్ ,  షారుక్ ఖాన్ , రజనీ కాంత్ ఇలా ఎంతో మంది మూవీ లు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిలిం అని ఒత్తి చెప్పడం అవసరం లేదు అనేది నా ఫీలింగ్. సినిమాని సినిమా అంటే చాలు అని తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: