టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయిన గోపిచంద్ కొన్ని రోజుల క్రితం పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.  మంచి అంచనాల నడుమ జులై 1 వ తేదీన విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ కలెక్షన్ లు దక్కలేదు.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి కూడా రాబోతోంది. దానితో ఈ మూవీ కి  బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు కూడా ఇకపై వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 2.40 కోట్లు , సీడెడ్ : 1.16 కోట్లు , యూ ఏ : 1.18 కోట్లు , ఈస్ట్ : 68 లక్షలు , వెస్ట్ : 50 లక్షలు ,
గుంటూర్ : 60 లక్షలు , కృష్ణ : 63 లక్షలు , నెల్లూర్ : 36 లక్షలు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా కమర్షియల్ మూవీ ఇప్పటి వరకు 7.51 కోట్ల షేర్ , 12.50 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా లో :  0.35 కోట్లు .
ఓవర్ సీస్ లో : 0.90 కోట్లు .
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ 8.81 కోట్ల షేర్ , 15.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించగా రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ , సత్య రాజ్ ఈ మూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: