ఇక ఇటీవల నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమామహేశ్వరి గారు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసిందే. ఉమామహేశ్వరి గారు మృతి చెందడంతో నందమూరి ఫ్యామిలీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబంలో ఒకవైపు బింబిసారా సినిమాతో కళ్యాణ్ రామ్ పండగ వాతావరణం క్రియేట్ చేయగా ఇదే తరుణంలో ఆ ఇంటి ఆడపిల్ల తనువు చాలించడం అందరికీ ఒక్కసారిగా చాలా షాక్ ని కలిగించింది. నందమూరి హీరోలు అందరూ కూడా ఉమామహేశ్వరి గారి మృతి పట్ల ఎంతగానో కన్నీటి పర్యంతమయ్యారు.ఉమామహేశ్వరి గారి ఆరోగ్య సమస్యల వలన అలాగే ఒత్తిడి వలన బాధను తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వారి సన్నిహితులు తెలియజేశారు. ఇక ఈ మృతిపై పోలీసులు కేసుని కూడా నమోదు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్దదైన నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.


ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఉమామహేశ్వరి గారికి ప్రతి విషయంలో కూడా అండగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మేనకోడలు పెళ్లిలో కూడా ఆయనే ఎంతో హడావిడిగా కనిపించినట్లు సమాచారం తెలిసింది. అయితే ఈ తరుణంలో ఉమామహేశ్వరి గారు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.తన సోదరి ఆఖరి చూపుల సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.ఐతే బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి కారు ఎక్కుతుండగా జనంలో నుంచి వచ్చిన ఓ అభిమాని అలా సెల్ఫీ అడగగానే నందమూరి బాలకృష్ణ అసలు ఏమి అనలేకపోయారు. ఒక సెకండ్ అలా సైలెంట్ గా చూసి ఆయన కారు ఎక్కి వెళ్లిపోయారు. అసలు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ విధంగా సెల్ఫీ అడగడం కరెక్ట్ కాదు అని, కొన్నిసార్లు అభిమానులు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అర్థం కావడం లేదని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: