ప్రముఖ హీరో నిఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం కార్తికేయ 2. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సాగిన ఈ చిత్రం ఇటీవల విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీ.జీ.విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటించగా అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను జూన్ 24వ తేదీన విడుదల చేసి సినిమాను జూలై 22వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది.

ఇక మరికొన్ని రోజుల తర్వాత ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఆరోజు చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆగస్టు 13వ తేదీన సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లు శరవేగంగా చేపడుతున్న విషయం తెలిసింది. అంతేకాదు నిఖిల్ ఏకంగా సీరియల్స్ లోకి కూడా ప్రవేశించి.. తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఇక రకరకాలుగా విభిన్న ప్రయత్నాలు చేస్తూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రం యూనిట్. ఇకపోతే కార్తికేయ మొదటి సినిమాను 2014లో విడుదలై ఉత్కంఠ భరితమైన  తెలుగు చిత్రం గా తెరకెక్కింది.

ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సీక్వెల్లో కూడా  నటిస్తుంది అని అనుకోగా.. కానీ ఎందుకో కొన్ని కారణాల చేత అనుపమ పరమేశ్వరన్ ను  ఈ సినిమా సీక్వెల్లో తీసుకున్నారు. ఇప్పటికే కార్తికేయ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో నైనా అనుపమ కెరియర్ మంచి సక్సెస్ బాట పడుతుందో లేదో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: