తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సాధారణ మెకానిక్ నుంచి ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. ఎన్నో లక్షలాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అజిత్ నటుడిగా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. అజిత్ ప్రేమ పుస్తకం అనే సినిమాతో 1993లో హీరోగా ఫస్ట్ మూవీ చేశాడు.ఈ సినిమాకి టాలీవుడ్ నటుడు మారుతి రావు దర్శకుడు.వాలి, దీన లాంటి సినిమాలతో అజిత్ యూత్ లో క్రేజ్ సంపాదించుకొని కోలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో అయ్యాడు. ఇక అజిత్ అంటే కేవలం యాక్టర్‌ మాత్రమే కాదు.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్స్‌ కూడా ఉన్నాయి అనే విషయం తెలిసిందే.ఇక సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు వాటిలో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఉంటాడు.అలా అజిత్‌కి ఉన్న టాలెంట్స్‌లో ఫొటోగ్రఫీ, షూటింగ్‌ ఇంకా బైక్‌ రేసింగ్‌ లాంటివి ఉన్నాయి. ఇటీవలే వీటిలో ఓ విభాగమైన రైఫిల్‌ షూటింగ్‌లో అజిత్‌ టీమ్‌ ఘన విజయం సాధించింది.


ఇక తమిళనాడులో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో మొత్తంగా ఆరు మెడల్స్‌ సాధించింది.ప్రస్తుతం అయితే ఈ వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అజిత్‌ అలాగే తన టీమ్‌తో కలసి రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో అదరగొట్టారు. ఈ క్రమంలో నాలుగు బంగారు పతాకాలతో పాటు ఇంకా రెండు కాంస్య పతకాలను సాధించారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో మొత్తంగా ఆరు పతకాలను అందుకున్నారు అజిత్‌ కుమార్ టీమ్‌. సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ మాస్టర్స్‌ మెన్‌ టీమ్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ టీమ్‌, 50 మీ. ఫ్రీ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌ ఇంకా స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌ కేటగిరిల్లో బంగారు పతకాలు వచ్చాయి.ఇలా కేవలం మూవీస్ మాత్రమే కాకుండా అజిత్ కి మిగతా వాటిల్లో కూడా ప్రతిభ వుంది. రీసెంట్ గా అజిత్ వలిమై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: