టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క పరిస్థితి గత కొన్ని సినిమాలుగా ఏ మాత్రం బాగోలేదు. ఒకటి అంటే ఒక సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. ఆ విధంగా ఇప్పుడు రాబోయే సినిమాలైనా టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క భవిష్యత్తును కాపాడుతుందా అనే సందిగ్ధత అందరిలో ఉంది. ఆగస్టు నెలలో నాలుగు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చే విధంగా సిద్ధమవుతున్నాయి. అవి మంచి క్రేజ్ నెలకొన్న హీరోల సినిమాలు కావడం ఈ చిత్రాలపై మంచి అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం.

మొదటి వారంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తపరచగా అందరూ అంతే నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రం టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచి సక్సెస్ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. ఆ తర్వాత వారం కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ ఆసక్తికరమైన చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా వెరైటీ కథనంతో రూపొందిన సినిమా కావడం చిత్ర పట్ల మంచి అంచనాలు ఏర్పడడానికి కారణం.

ఇక ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న మరొక భారీ క్రేజీ చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బాగుంటే తప్పకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి వచ్చినట్లే అని భావిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కాబోతోంది. మరి ఈ మూడు సినిమాలు ఏ విధమైన ఫలితాన్ని అందుకొని ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: